మా అమ్మ చేసిన దానధర్మాలే నన్ను ఈ స్థాయిలో ఉంచాయి: సీనియర్ నటి తులసి
Add ap7am to your home Screen

మా అమ్మ చేసిన దానధర్మాలే నన్ను ఈ స్థాయిలో ఉంచాయి: సీనియర్ నటి తులసి

Thulasi abot her mothers good heart
  • మా అమ్మమ్మ గారి ఊరు తాడేపల్లి గూడెం 
  • నేను చెన్నైలో పుట్టిపెరిగాను 
  • నాకు మా అమ్మ చెప్పింది అదేనన్న తులసి
చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకి పరిచయమైన తులసి, ఆ తరువాత కథానాయికగా కొన్ని సినిమాలు చేశారు. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్ గా ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, "నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. మా అమ్మగారి పుట్టిల్లు తాడేపల్లి గూడెం .. వాళ్లది శ్రీమంతుల కుటుంబం. అమ్మకి సినిమాల్లో నటించాలని వుండేది. అప్పటికే సినిమా ఫీల్డ్ లో ఆమెకి తెలిసినవాళ్లు వున్నారు.

 అందువలన అవకాశాల కోసం చెన్నై వెళ్లి, అక్కడ ఇల్లు కూడా కొనేసింది. మొదటి నుంచి కూడా ఆమె దానధర్మాలు ఎక్కువగా చేసేది. అప్పట్లో మా ఇంట్లో పని చేసేవారికి కూడా ఆమె ఏడు ఇళ్లవరకూ కట్టించి ఇచ్చింది. ఎంతవరకూ అవసరమో అంతవరకూ ఉంచేసుకుని మిగతాది దానం చేయమనే నాకు కూడా ఆమె చెప్పేది. ఆమె చేసిన పుణ్యం వల్లనే ఈ రోజున నేను ఈ స్థాయిలో వున్నాను" అని  తులసి చెప్పుకొచ్చారు.
Thulasi
Ali
Tollywood

More Telugu News