Budda Venkanna: తొమ్మిది నెల‌ల క్రితం ఏపీకి ‘జగరోనా' వైరస్​ సోకింది: బుద్ధా వెంకన్న

TDP Leader Budda Venkanna ironies Ap is suffering from Jagarona virus
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న వైరస్ ‘కరోనా‘. ఆ పదంలో ‘క’ బదులు ‘జగ‘ను ఉంచి ‘జగరోనా‘ వైరస్ అంటూ ఏపీ సీఎం జగన్ ని విమర్శిస్తూ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ‘కరోనా అమ్మ మొగుడు ’జగరోనా’ అని ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. ఇంకా మీ చెవికి చేరలేదా? అంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

తొమ్మిది నెల‌ల క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి సోకిన ఈ ‘జగరోనా’ వైర‌స్‌తో అభివృద్ధి అంత‌మైందని, ఆదాయం ఆవిరైందని, రాష్ట్ర‌మంతా ఈ వైర‌స్ ఎఫెక్ట్‌తో అల్లాడిపోతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ’జగరోనా’ వైర‌స్‌ని క‌ట్ట‌డి చేయ‌గ‌ల శ‌క్తి ప్ర‌స్తుతం సెర్బియా దేశానికే ఉంద‌ంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Go Back to Shorts
Budda Venkanna
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News