పార్లమెంటు వద్ద కలకలం.. బారికేడ్‌ను ఢీకొట్టిన ఎంపీ కారు.. ఏకే 47లతో గురి పెట్టిన భద్రతా బలగాలు.. వీడియో ఇదిగో

పార్లమెంటు వద్ద కలకలం.. బారికేడ్‌ను ఢీకొట్టిన ఎంపీ కారు.. ఏకే 47లతో గురి పెట్టిన భద్రతా బలగాలు.. వీడియో ఇదిగో

Security scare in Parliament after MPs car crashes into boom barrier
  • కొనసాగుతోన్న పార్లమెంటు సమావేశాలు
  • గేట్ నెంబ‌ర్ వ‌న్ వ‌ద్ద అలజడి
  • బూమ్ బ్యారికేడ్‌ను ఢీ కొట్టిన కారు
  • వెంటనే మోగిన సైర‌న్
పార్ల‌మెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు గేట్ నెంబ‌ర్ వ‌న్ వ‌ద్ద కలకలం చెలరేగింది. బూమ్ బ్యారికేడ్‌ను ఓ కారు ఢీ కొట్టడంతో దాని నుంచి స్పైక్స్ బ‌య‌ట‌కు వ‌చ్చి, ఆ కారు అక్క‌డే నిలిచిపోయింది. వెంటనే సైర‌న్ మోగడంతో అక్కడ ఉన్న భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్త‌మై ఏకే 47 తుపాకులతో ఆ కారుకి గురి పెట్టారు.

ఆ కారు  బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన‌క‌ర్‌దని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  ఈ ఘటనలో ఆ కారు స్వల్పంగా ధ్వంసమైంది. పొరపాటున ఆ కారు వాటికి తగిలిందని భద్రతా బలగాలు గుర్తించాయి. కాగా, 2001లో పార్ల‌మెంట్‌పై ఉగ్ర‌దాడి జ‌రిగిన త‌ర్వాత‌ భద్రతను కట్టుదిట్టం చేస్తూ.. పార్లమెంటు గేట్ల వ‌ద్ద స్పైక్స్‌ల‌ను అమ‌ర్చారు.
Parliament
New Delhi

More Telugu News