ఉత్తరాంధ్ర మీ జాగీరా?: మంత్రి బొత్సపై అశోక్ బాబు ఫైర్
- ఉత్తరాంధ్రలో చంద్రబాబును తిరగనివ్వబోము అంటున్నారు
- విశాఖ ప్రజలు టీడీపీనే గెలిపించారనే విషయాన్ని మర్చిపోవద్దు
- ఏ1, ఏ2లు విశాఖలో భూకబ్జాలు చేస్తున్నారు
పెయిడ్ ఆర్టిస్టులకు పచ్చ చీరలు కట్టించి ఒక ప్లాన్ ప్రకారమే చంద్రబాబుపై వైసీపీ నేతలు దాడి చేయించారని అశోక్ బాబు విమర్శించారు. ఇక పథకం ప్రకారమే దాడి జరిగిందని చెప్పారు. ఏ1, ఏ2లు విశాఖలో భూకబ్జాలు చేస్తున్నారని... వీటిని సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని అన్నారు. ఉత్తరాంధ్రలో పర్యటించి వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలు వివరిస్తామని చెప్పారు.