ఒక్క మంత్రిత్వ శాఖను కూడా తీసుకోని కేజ్రీవాల్.. కారణం చెప్పిన ఢిల్లీ సీఎం!
- 2017 నుంచి ఒక్క జల వనరుల శాఖనే చూసిన కేజ్రీవాల్
- అంతకు ముందు కూడా ఏ శాఖనూ తీసుకోలేదు
- ఇప్పుడూ ఏ శాఖ కూడా తీసుకోనని చెప్పిన ఢిల్లీ సీఎం
ఆ బాధ్యత కోసం వీటికి దూరం
ఒక్క మంత్రిత్వ శాఖను కూడా మీ పరిధిలో ఎందుకు ఉంచుకోలేదని చాలా మంది తనను అడుగుతున్నారని, ఢిల్లీ ప్రజలకు వీలైనంతగా అందుబాటులో ఉండాలన్నదే తన లక్ష్యమని, అదే తన ఫస్ట్ చాయిస్ అని తెలిపారు. అందుకే ఏ మంత్రిత్వ శాఖను కూడా తన అధీనంలో ఉంచుకోలేదన్నారు.‘‘నా పరిధిలో ఏ మంత్రిత్వ శాఖ కూడా లేకపోవడంతో.. అన్ని శాఖలపైనా ఓ కన్నేసి ఉంచడానికి నాకు వీలవుతుంది. ఏదైనా ఒక శాఖ బాధ్యతలు నాపై ఉంటే.. దానిపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. మిగతా వాటి విషయంగా ఇబ్బంది ఎదురవుతుంది” అని కేజ్రీవాల్ చెప్పారు.