Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవిగో!  

షార్ట్స్‌లో చూడండి
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశానంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. మార్చ్ 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డబ్బు, మద్యం ప్రమేయం లేకుండా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమాలకు పాల్పడే వారిపై అనర్హత వేటు వేస్తామని… గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పంచాయతీ ఎన్నికలకు 5 రోజులు మాత్రమే ప్రచారం నిర్వహించాలని పేర్ని నాని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 8 రోజులు ప్రచారం నిర్వహించాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు గిరిజనులే అర్హులని చెప్పారు.  

ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్, ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ లిమిటెడ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్ని నాని వెల్లడించారు. జెన్కో ఆధ్వరంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
AP Cabinet
Jagan
Perni Nani
YSRCP

More Telugu News