లైఫ్ లో ప్రేమనేది వుండాలి: హీరో విజయ్ దేవరకొండ

 Vijay Devarakonda about love in life
  • ఈ సినిమాలో మూడు ప్రేమకథలు ఉంటాయి 
  •  డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాను 
  •  యూత్ కి నచ్చుతుందన్న విజయ్ దేవరకొండ  
విజయ్ దేవరకొండ అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ బిజీగా వున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .."ఈ సినిమాలో మూడు ప్రేమకథలు ఉంటాయి .. ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. గెటప్స్ పరంగా .. పాత్రల మధ్య వేరియేషన్స్ ను చూపించేపరంగా చాలా కేర్ తీసుకోవలసి వచ్చింది. ఈ సినిమా చేయడానికి ముందు ప్రేమ అనేది ఒక నాన్ సెన్స్ అనుకున్నాను. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు లైఫ్ లో ప్రేమ అనేది వుండాలనిపించింది. అప్పుడే లైఫ్ అందంగా .. అర్థవంతంగా ఉంటుందనిపించింది. యూత్ కి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Vijay Devarakonda
Rasi Khanna
World Famous Lover Movie

More Telugu News