ఆరేళ్లలో విభజన హామీలు పది శాతం కూడా నెరవేరలేదు!: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
- వైజాగ్ కు రైల్వేజోన్ ఇచ్చినా ఉపయోగం లేదు
- ‘పోలవరం’ పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనా ఉంది
- నరేగా నిధుల విడుదలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనా ఉందని, నరేగా నిధుల విడుదలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఫలానావి ఇచ్చామని స్పష్టంగా లేవని విమర్శించారు. ఈ సందర్భంగా వైసీపీపై ఆయన విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని నాడు ఎన్నికల సమయంలో వైసీపీ హామీ ఇచ్చిందని, ఆ ‘హోదా’ను ఎలా సాధిస్తారో రాష్ట్ర ప్రజలకు తెలియజెెప్పాలని డిమాండ్ చేశారు.