Nara Lokesh: విషమించిన ఆరోగ్యం.. అయినా గుండెలపై సేవ్ అమరావతి ప్లకార్డు.. వీడియో పోస్ట్ చేసిన లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
అమరావతి కోసం దీక్ష చేబట్టిన యువకుల దీక్షను పోలీసులు గత అర్ధరాత్రి భగ్నం చేసి, వారిని ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. వీరి ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయినప్పటికీ గుండెలపై 'సేవ్ అమరావతి' ప్లకార్డును పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ నేత నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

'ఆరోగ్యం విషమించినా రాష్ట్ర భవిష్యత్తు అయిన అమరావతిని మాత్రం వదలలేదు. పోలీసులు దీక్ష భగ్నంచేసినా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు యువకులు. ఆందోళనలు 55వ రోజుకు చేరినా జగన్ గారి మనసు కరగడం లేదు. జగన్ గారు ఈ రోజు అమరావతి రైతులకు చేసిన అన్యాయం రేపు విశాఖ రైతులకు చెయ్యరని నమ్మకం ఏంటి?' అని ప్రశ్నించారు.

'మూడు ముక్కల రాజధాని వద్దు...  అభివృద్ధే ముద్దు' అని అన్ని ప్రాంతాల ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారని లోకేశ్ అన్నారు. జగన్ గారికి మాత్రం ఈ విషయం అర్ధం కావడం లేదని విమర్శించారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Amaravati
Andhra Pradesh

More Telugu News