ప్రజలు జగన్ వెంట ఉన్నంత వరకూ ఎవరూ ఏమీ చేయలేరు: మంత్రి అవంతి
- విశాఖలో టీడీపీకి సీట్లు కావాలి
- రాజధానిగా మాత్రం విశాఖ వద్దా?
- జగన్ పై ఎన్ని కుట్రలు చేస్తే అంతగా ఆయనపై సానుభూతి వస్తుంది
ప్రభుత్వ పథకాలతో జగన్ కు ఎక్కడ మంచిపేరు వస్తోందని, పాతికేళ్ల వరకూ ఆయనే అధికారంలో ఉంటారేమోనన్న భయంతో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. చంద్రబాబు ఎన్ని కుట్రలూ కుతంత్రాలు చేస్తే ప్రజల్లో జగన్ పై సానుభూతి అంతగా పెరుగుతుందని అన్నారు. ప్రజలు జగన్ వెంట ఉన్నంత వరకూ ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు.
తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పేదలకు 25 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారని, ఇలాంటి సంఘటన చరిత్రలోఎక్కడా జరగలేదని అన్నారు. తన తండ్రి రికార్డును వైఎస్ జగన్ బద్దలు కొట్టబోతున్నారని, వచ్చే ఉగాదికి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నట్టు వివరించారు.