Budda Venkanna: అది ఒక్క వైయస్ ఫ్యామిలీకే దక్కింది విజయసాయిరెడ్డి గారూ: బుద్ధా వెంకన్న
- గోబెల్స్ ప్రచారంలో జగన్ ను మించిన వారు ఎవరున్నారు?
- బ్లాక్ మీడియాను నడిపే మీరా నీతులు చెప్పేది?
- జగన్ ను మించిన మాయగాడు ఎవరున్నారు?
గోబెల్స్ ప్రచారం చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను మించినవారు ఎవరున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. 'గోబెల్స్ ప్రచారంలో జగన్ గారిని మించిన వారు ఎవరు ఉన్నారు విజయసాయిరెడ్డి గారు? బంగాళాఖాతాన్ని వెనక్కి జరపాలి అన్నా, నదులని వెనక్కి ప్రవహించేలా చెయ్యాలి అన్నా, మూడు మాయా రాజధానులు కట్టాలన్నా అది మీ జగన్ గారు నడిపే దొంగ బ్లాక్ మీడియాకే చెల్లింది. పోలవరానికి పునాది పడలేదు, కమ్మ డీఎస్పీలకు మాత్రమే ప్రమోషన్లు, అమరావతి అంతా గ్రాఫిక్స్ అంటూ రాష్ట్రంలో అసత్యాల తుపాను సృష్టించిన బ్లాక్ మీడియాను నడిపే జగన్ గారు, మీరా నీతులు చెప్పేది విజయసాయి రెడ్డి గారు?
తుపాన్లు ఆపడం, తండ్రి పోతే ఇంట్లో వాళ్లు ఎవరూ పోకపోయినా, నాన్న కోసం వేల మంది పోయారు అంటూ బిల్డప్ వార్తలు, గ్రాఫిక్స్ లో జనాలను సృష్టించడం ఒక్క వైఎస్ ఫ్యామిలీకే దక్కింది. రివర్స్ పాలన అమలు చేస్తూ ప్రజలతో పబ్జి గేమ్ ఆడుతున్న జగన్ గారిని మించిన మాయగాడు ఎవరు ఉంటారు సాయిరెడ్డిగారు?' అంటూ తీవ్య వ్యాఖ్యలు చేశారు.