ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతాం.. అమరావతిని కాపాడుకుంటాం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు
- మండలి రద్దుపై తీర్మానం చేసినంత మాత్రాన మా పోరాటం ఆగదు
- వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా, పాలనాపరంగా విఫలం
- ‘ఆరోగ్యశ్రీ’ రద్దు చేయాలన్న నిర్ణయం కరెక్టు కాదు
ఈ సందర్భంగా ‘ఆరోగ్యశ్రీ’ రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపైనా అశోక్ బాబు విమర్శలు చేశారు. ఈ నిర్ణయం సరికాదని, ‘ఆరోగ్య శ్రీ’ స్థానంలో బీమా పథకంతో పేద రోగులకు న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఏపీ ఆర్థిక వ్యవస్థ డొల్లతనం బయటపడుతుందని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.