సినీ దర్శకుడు శంకర్ కు భూమి కేటాయించడంపై కేసీఆర్ సర్కారుకు హైకోర్టు నోటీసులు!
- మోకిల్ల గ్రామ సమీపంలో ఐదు ఎకరాలు
- ఎకరా రూ. 5 లక్షలకే అప్పగింత
- హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం
ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఏ అభిషేక్ రెడ్డిల ధర్మాసనం, రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి, హెచ్ఎండీఏ, రంగారెడ్డి కలెక్టర్, సీసీఎల్ఎం, శంకర్ లకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ల దాఖలుకు 4 వారాల గడువునిచ్చింది. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ విలువ ఎకరాకు రూ. 20 లక్షల వరకూ ఉందని, మార్కెట్ విలువ రూ. 5 కోట్లకు పైమాటేనని తెలిపారు.