విజయ్ సేతుపతి చేతుల మీదుగా 'వరల్డ్ ఫేమస్ లవర్' తమిళ టీజర్
- నలుగురు కథానాయికలతో విజయ్ దేవరకొండ
- ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తమిళ టీజర్
- వచ్చేనెల 14వ తేదీన సినిమా విడుదల
తెలుగుతోపాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తమిళ వెర్షన్ కి సంబంధించిన టీజర్ ను, హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయించనున్నారు. ఈ సినిమాతో తెలుగుతో పాటు తమిళంలోను తన మార్కెట్ పెరుగుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ తో చేస్తున్న ప్రాజెక్టుతో ఆయన బాలీవుడ్ కి పరిచయమవుతుండటం విశేషం.