అప్పట్లో నన్ను పెళ్లి చేసుకుంటానంటూ చాలామంది చెన్నై వచ్చేవారు: హీరో సుమన్
- లవ్ లెటర్స్ ఎక్కువగా వచ్చేవి
- ఎవరినీ ఎంకరేజ్ చేసేవాడిని కాదు
- సినిమా వేరు .. జీవితం వేరని చెప్పేవాడినన్న సుమన్
ఇలాంటి పనులు చేయవద్దు .. నటన అనేది నా వృత్తి .. నా పనిని నేను చేసుకు వెళుతున్నాను. మీ పని ఏదైతే వుందో దానిపై దృష్టి పెట్టండి అని రిప్లై ఇచ్చేవాడిని. ఇక కొంతమంది అమ్మాయిలైతే నన్ను పెళ్లి చేసుకుంటానంటూ చెన్నైలో మా ఇంటికి వచ్చేసేవారు. అదోరకం అమాయకత్వమని నాకు తెలుసు. సినిమా వేరు .. జీవితం వేరు అని వాళ్లకి మా మేనేజర్ నచ్చజెప్పేవారు. కొంతమందిని వాళ్ల ఇంటివరకూ తీసుకెళ్లి పేరెంట్స్ కి అప్పగించిన సందర్భాలు కూడా వున్నాయి" అని చెప్పుకొచ్చారు.