ఆ కేసు నుంచి జగన్ తప్పించుకోవడం అసాధ్యం: యనమల
- మనీలాండరింగ్ కేసు నుంచి తప్పించుకోలేరు
- ట్రయల్ మొదలైతే జగన్ దృష్టంతా కోర్టు బోనుపైనే ఉంటుంది
- అధికారం ఉందని ఇష్టానుసారం చేయడం సరికాదు
అధికారం ఉందని ఇష్టానుసారం చేయడం సరికాదని యనమల అన్నారు. తొలుత ఆర్డినరీ రూపంలో వచ్చిన వికేంద్రీకరణ బిల్లు ఆ తర్వాత మనీ బిల్లుగా వచ్చిందని చెప్పారు. ఎస్సీ కమిషన్, ఆంగ్ల మాధ్యమం బిల్లులు మండలికి ఆర్డినరీ బిల్లులుగా వచ్చాయని తెలిపారు. మూడు రాజధానుల బిల్లు ఆర్డినరీ బిల్లా?లేక మనీ బిల్లా? అని హైకోర్టు సైతం ప్రశ్నించిందని చెప్పారు. ఈ రెండు బిల్లులకు పద్ధతులు వేర్వేరుగా ఉంటాయని అన్నారు. ప్రజాభిప్రాయం తీసుకుని చేయాల్సిన నిర్ణయాలను వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం చేస్తోందని మండిపడ్డారు. బిల్లులను మంత్రులు చదువుతున్నారా? అని యనమల ప్రశ్నించారు.