ఇప్పుడు మరో బిస్కెట్ వేసి రాయలసీమ వాసుల్ని మోసం చేస్తున్నారు: నారా లోకేశ్

  • సీఎం జగన్ పై ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
  • సీమలో అనేక కంపెనీలు రాకుండా చేశారని ఆరోపణ
  • అభివృద్ధికి అడ్డంకిగా మారారని విమర్శలు
ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్న అనేక కంపెనీలను రాకుండా చేసి అభివృద్ధికి అడ్డంకిగా మారారని మండిపడ్డారు. ఇప్పుడు కర్నూలుకు హైకోర్టును తరలించే ప్రక్రియ గురించి ఆలోచిస్తాం అంటూ మరో బిస్కెట్ వేసి రాయలసీమ వాసుల్ని మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 మూడు ముక్కలాట తప్ప ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం ఏంచేస్తారో ఏనాడైనా చెప్పారా? అంటూ ప్రశ్నించారు. మీ స్వార్థం కోసం కులం, ప్రాంతం, మతం పేరుతో ప్రజలు కొట్టుకుని చావాలా? అంటూ నిలదీశారు. "ఉత్తరాంధ్ర, రాయలసీమ ద్రోహి వైఎస్ జగన్. ఉత్తరాంధ్ర యువత ఉపాధి పొందుతున్న ఐటీ కంపెనీలను విశాఖ నుంచి హైదరాబాదుకు తరిమేస్తున్నారు. ఐటీ సెజ్ ను ఖాళీ చేయిస్తున్నారు" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Jagan
Rayalaseema
AP Capital
Vizag
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News