అంబేద్కర్ గారేమైనా పొరపాటు చేశారేమో!: సీఎం జగన్ పై సోమిరెడ్డి వ్యాఖ్యలు
- రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదన్న జగన్!
- దీన్ని జగనే మొదటిసారి గుర్తించారంటూ సోమిరెడ్డి వ్యంగ్యం
- గత పాలకులెవ్వరూ గుర్తించలేకపోయారని సెటైర్
మొత్తానికి రాజధాని అంటే సరికొత్త నిర్వచనం చెబుతున్నారని, ఈ మాత్రం ఆలోచన 72 ఏళ్లుగా పరిపాలించిన వారికి కూడా లేకపోయింది అంటూ ఎద్దేవా చేశారు. జయలలిత ఊటీ నుంచి పరిపాలించారని చెబుతున్నారని, మన రాష్ట్రంలో కూడా హార్సిలీ హిల్స్, అరకు వంటి ప్రాంతాలున్నాయని, అక్కడి నుంచి పరిపాలన సాగించుకోవచ్చని ఎత్తిపొడిచారు.