తందై పెరియార్‌ను రజనీకాంత్ కించపరిచారు: పోలీసులకు ఫిర్యాదు
- ‘తుగ్లక్’ పత్రిక వార్షికోత్సవంలో రజనీ వివాదాస్పద వ్యాఖ్యలు
- సీతారాముల ప్రతిమలను పెరియార్ నగ్నంగా తీసుకెళ్లారని ఆరోపణ
- ద్రావిడర్ విడుదలై కళగం నేతల మండిపాటు
రజనీ తన వ్యాఖ్యలతో పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరియార్‌ను కించపరిచిన రజనీకాంత్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ద్రావిడర్ విడుదలై కళగం అధ్యక్షుడు కొళత్తూర్ మణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.