పవన్ కల్యాణ్ కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్ కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు

  • విశాఖ నుంచి కాకినాడకు వస్తున్న పవన్ కల్యాణ్
  • తుని వద్ద కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు
  • ఉద్రిక్తభరితంగా కాకినాడ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కాకినాడలో పర్యటిస్తున్నారు. వైసీపీ దాడుల్లో గాయపడ్డ జనసేన కార్యకర్తలను ఆయన పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, నగరంలో 144 సెక్షన్ ను విధించారు. మరోవైపు, విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో కాకినాడకు వస్తున్న పవన్ కల్యాణ్ కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు. పవన్ పర్యటనను అడ్డుకోబోమని, ఆయనను అరెస్ట్ చేయబోమని జిల్లా ఎస్పీ నయీం హస్మీ ప్రకటించినప్పటికీ... పవన్ ను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Pawan Kalyan
Janasena
Kakinada

More Telugu News