పవన్ మామ పంపిన సందేశంతో పరవశించిపోయిన సాయిధరమ్ తేజ్
- హిట్ టాక్ తెచ్చుకున్న ప్రతిరోజు పండగే చిత్రం
- మేనల్లుడ్ని అభినందిస్తూ పవన్ కల్యాణ్ స్పెషల్ మెసేజ్
- మాటలు రావడం లేదంటూ సాయితేజ్
"ప్రతిరోజు పండగే చిత్రం గ్రాండ్ సక్సెస్ అయినందుకు శుభాభినందనలు. భవిష్యత్తులో నువ్వు నటించే సినిమాలు ఇలాగే మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాను" అంటూ పవన్ సందేశం పంపారు. దీనిపై సాయితేజ్ స్పందిస్తూ, మాటలు రావడం లేదని ట్వీట్ చేశాడు. థ్యాంక్స్ చెబితే అది చాలా చిన్నమాట అవుతుందని, "లవ్యూ పవన్ కల్యాణ్ మామా" అంటూ తన హర్షం వెలిబుచ్చాడు.