ధోనీలా మంచి ఫినిషర్ గా ఎదగాలనుంది: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ
- గత ఏడాదిలో ధోనీతో కలిసి ఆడా.. అది నా అదృష్టం
- భారత్ తో మూడు వన్డేలు ఆడటానికి చేరుకున్న ఆసీస్ జట్టు
- 14న వాంఖడే స్టేడియంలో తొలి వన్డే
గత ఏడాది వన్డే ప్రపంకప్ కు ముందు భారత్ లో పర్యటించిన ఆస్ట్రేలియా ఐదు వన్డేల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను ఆసీస్ 3-2 తేడాతో సొంతం చేసుకుంది. తాజా సిరీస్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మంగళవారం జరుగనుంది. భారత జట్టులో ధోనీ ఈసారి ఆడటం లేదు.