ఝార్ఖండ్ నిరసనల్లో ‘పుష్పరాజ్’.. డిమాండ్లు నెరవేరే వరకు ‘తగ్గేదేలే’ అంటూ సవాల్!
- రాంచీలో పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పుష్ప గెటప్‌లో వచ్చిన వ్యక్తి
- పేపర్ లీక్‌లు ఆగాలని ప్రభుత్వాన్ని డిమాండ్
- డబ్బున్నవాళ్లకే ఉద్యోగాలు దక్కడం అన్యాయమని ఆవేదన
- విద్యార్థుల డిమాండ్లలో న్యాయం ఉందంటూ మద్దతు
- పుష్ప స్టైల్‌లో ‘తగ్గేదేలే’ అంటూ డైలాగ్
చేతిలో గొడ్డలి.. ఒంటిపై పుష్పరాజ్ గెటప్.. నోట ‘తగ్గేదేలే’ డైలాగ్! ఝార్ఖండ్ రాజధాని రాంచీలో పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా పుష్ప గెటప్‌లో వచ్చి అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు.
పేపర్ లీక్‌లను అడ్డుకోవాలని, డబ్బున్నవాళ్లకే ఉద్యోగాలు దక్కడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యార్థులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే నిరసనలో పాల్గొన్నట్లు చెప్పాడు. ఆందోళన శాంతియుతంగా సాగుతుండటంతో తాను మద్దతుగా నిలిచానని తెలిపాడు. విద్యార్థుల డిమాండ్లలో న్యాయం ఉందని, ప్రభుత్వం వాటిని నెరవేర్చాలని కోరాడు.
చివర్లో పుష్ప స్టైల్‌లో ‘డిమాండ్లు నెరవేరే వరకు విద్యార్థులు తగ్గేదేలే’ అంటూ చెప్పిన డైలాగ్ అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
ఇక తన గెటప్ వెనుక మరో ఆసక్తికరమైన విషయం ఉందని అతడు చెప్పాడు. తాను అల్లు అర్జున్‌కు పెద్ద అభిమానినని తెలిపాడు. పుష్ప-2 విడుదలైనప్పటి నుంచి పుష్పరాజ్ గెటప్‌లోనే ఉంటున్నట్లు చెప్పాడు. పుష్ప-3 వచ్చే వరకు ఇదే గెటప్‌లో కనిపిస్తానని వెల్లడించాడు.
ముంబయి సహా పలు నగరాల్లో పుష్ప గెటప్‌లో షోలు కూడా చేస్తుంటానని చెప్పాడు. అయితే ఈసారి తన గెటప్ వినోదం కోసం కాదు.. విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలిపేందుకేనని స్పష్టం చేశాడు.