ఎవరికీ ముద్దులివ్వలేదు, తీసుకోలేదు: ఉదిత్ నారాయణ్‌పై కుమార్ సాను పరోక్ష వ్యాఖ్య

Kumar Sanu indirect comments on Udit Narayan over kissing controversy
  • అభిమానుల నుంచి ముద్దులు తీసుకోలేదని, ఇవ్వలేదన్న కుమార్ సాను
  • 2025లో అనుకోకుండా ఉదిత్ నారాయణ్‌కు ముద్దు ఇచ్చిన మహిళా అభిమాని
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన కుమార్ సాను వ్యాఖ్య
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కుమార్ సాను తన సహచర గాయకుడు ఉదిత్ నారాయణ్‌ను ఉద్దేశించి పరోక్షంగా కొన్ని హాస్యోక్తులు కురిపించారు. తాను అభిమానుల నుంచి ఎప్పుడూ ముద్దులు తీసుకోలేదని, ఎవరికీ ఇవ్వలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. 2025లో ఉదిత్ నారాయణ్ ఎదుర్కొన్న 'ముద్దు' వివాదాన్ని దృష్టిలో ఉంచుకునే కుమార్ సాను ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కుమార్ సానుకు, 90వ దశకంలో మీకు మహిళా అభిమానుల ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది కదా అని ప్రశ్నించగా ఆయన నవ్వుతూ స్పందించారు. "నా దగ్గరకు వచ్చి ఎవరూ ముద్దు పెట్టలేదు, నేను కూడా ఎవరికీ ఇవ్వలేదు. అటువంటి పనులకు నేను ఎప్పుడూ దూరంగానే ఉన్నాను" అని ఆయన బదులిచ్చారు.

2025లో ఉదిత్ నారాయణ్ ఒక లైవ్ కాన్సర్ట్‌లో ఉండగా, సెల్ఫీ కోసం వచ్చిన ఒక మహిళా అభిమాని ఆయనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఉదిత్ అటువైపు తిరగడంతో అనుకోకుండా ఇద్దరి పెదవులు తగిలాయి. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు, వ్యక్తిగత హద్దుల గురించి పెద్ద ఎత్తున చర్చే జరిగింది. కాగా, ఉదిత్ నారాయణ్‌తో ఒకప్పుడు తనకు వృత్తిపరమైన పోటీ ఉండేదని, అయితే ప్రస్తుతం తమ మధ్య మంచి స్నేహబంధం ఉందని కుమార్ సాను ఇదే ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
Advertisement
Kumar Sanu
Udit Narayan
Bollywood singers
Kiss controversy
Music industry news
Udit Narayan kiss video

More Telugu News