రాజధాని అరెస్టులపై స్పందించిన పవన్ కల్యాణ్

  • రాజధాని ప్రాంతంలో రైతుల నిరసనలు
  • పలువురు నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ
రాజధాని ప్రాంతంలో రైతులు ప్రజాస్వామ్య విధానంలో, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. చినకాకాని వద్ద పోలీసులు వ్యవహరించిన తీరును పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం భావిస్తే అది పొరబాటే అవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని, అటు పరిపాలన రాజధాని విషయంలో విశాఖ వాసులు కూడా సంతృప్తిగా లేరని ఆరోపించారు. ఆందోళనలను అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు చేపడతారని ప్రభుత్వం గ్రహించాలని హితవు పలికారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
Amaravati
YSRCP
Telugudesam

More Telugu News