హిందీ బిగ్ బాస్ వివాదం... విశాల్ ఆదిత్యను చెప్పుతో కొట్టిన మధురిమ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిందీ బిగ్ బాస్ వివాదం... విశాల్ ఆదిత్యను చెప్పుతో కొట్టిన మధురిమ!

  • హిందీలో బిగ్ బాస్ సీజన్ 13
  • ఇప్పటికే ఎన్నో వివాదాలు
  • తాజాగా గొడవపడ్డ విశాల్, మధురిమ
హిందీ బిగ్ బాస్ సీజన్ 13 ఇప్పటికే ఎన్నో వివాదాల్లో మునిగిపోగా, తాజాగా ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య జరిగిన గొడవ పెను దుమారాన్ని సృష్టించింది. నిన్న మొన్నటి వరకూ ఎంతో సఖ్యంగా ఉన్న విశాల్ ఆదిత్య, మధురిమలు ఇప్పుడు ఒకరి పేరు చెబితే ఒకరు భగ్గుమంటున్నారు. తాజాగా గార్డెన్ ఏరియాలో ఇద్దరూ తగువులాడుకోగా, ఆగ్రహంతో రెచ్చిపోయిన విశాల్, మధురిమను నోటికొచ్చినట్టు తిడుతూ, అక్కడి నుంచి వెళ్లిపోవాలని గద్దించాడు.

అప్పటికే విశాల్ పై అంతే ఆగ్రహంతో ఉన్న మధురిమ, తన కోపాన్ని ఆపుకోలేక, కాలిచెప్పును తీసి విశాల్ ను కొట్టడం తీవ్ర సంచలనమైంది. జరిగిన ఘటనపై ఇద్దరినీ కన్ఫెషన్ రూమ్ కు పిలిపించిన బిగ్ బాస్ వివరణ కోరాడు. ఇద్దరినీ మందలించాడు. చివరకు మధురిమ క్షమాపణ కోరగా, రెండు వారాల పాటు నేరుగా ఎలిమినేషన్ కు నామినేట్ చేస్తున్నట్టు బిగ్ బాస్ స్పష్టం చేశాడు.
Hindi
Biggboss
Vishal
Madhurima

More Telugu News