విజయవాడ ఎంపీ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు... నాని గృహనిర్బంధం!
- అమరావతి రైతుల నిరసన
- దీక్షకు మద్దతుగా గద్దె రామ్మోహన్ ధర్నా
- సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన నాని
- హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
నాని బయటకు వెళ్లేందుకు వీలు లేదని స్పష్టం చేసిన పోలీసు అధికారులు, ఆయన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన కేశినేని నాని, పోలీసుల సాయంతో, ప్రభుత్వం తనను అక్రమంగా నిర్బంధించిందని ఆరోపించారు. ప్రజల నిరసనలను తొక్కేస్తున్నారని మండిపడ్డారు.