సొంత బ్యానర్ స్థాపించిన కమెడియన్ అలీ... పేరు 'అలీవుడ్ ఎంటర్టయిన్ మెంట్స్'!
- తన పేరు కలిసొచ్చేలా బ్యానర్
- వెబ్ సిరీస్ లు, సీరియళ్ల నిర్మాణం
- తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కార్యకలాపాలు
ఈ బ్యానర్ ద్వారా వెబ్ సిరీస్ లు, వాణిజ్య ప్రకటనలు, టీవీ సీరియళ్లు, ఎంటర్టయిన్ మెంట్ షోలు నిర్మించాలన్నది అలీ ఆలోచన. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ కార్యకలాపాలు ఉంటాయట! హైదరాబాదు శివార్లలోని మణికొండలో ఉన్న తన నివాసానికి దగ్గర్లోనే 'అలీవుడ్ ఎంటర్టయిన్ మెంట్స్' ఆఫీసును ఏర్పాటు చేసినట్టు అలీ తెలిపారు.