Jagan: రాజధాని తరలింపుపై జగన్ పరోక్ష వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
వైయస్సార్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తమకు మూడు ప్రాంతాలూ సమానమే అని చెప్పారు. తద్వారా రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండబోతున్నాయనే సంకేతాలను మరోసారి ఇచ్చారు. ఇటీవల అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండచ్చేమో అంటూ చేసిన వ్యాఖ్యలు వేడిని రాజేసిన సంగతి తెలిసిందే.

ఈరోజు జగన్ మాట్లాడుతూ, అన్ని ప్రాంతాలకు మేలు చేసేలా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వం కొందరికే న్యాయం చేసిందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాలను సరిదిద్దుతామని చెప్పారు. అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేలా చూస్తామని తెలిపారు. అందరి అభివృద్ధి కోసం సరైన నిర్ణయాలను తీసుకుంటూ, పాలన కొనసాగిస్తామని చెప్పారు. దేవుడి దయతో వచ్చిన ఈ పదవిని అందరి అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని అన్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Amaravati

More Telugu News