విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
- ఈ ఉదయం టేకాఫ్ అయిన విమానం
- సాంకేతిక సమస్యను గుర్తించిన పైలెట్లు
- మళ్లీ వెనక్కు వచ్చి క్షేమంగా ల్యాండ్ అయిన విమానం
ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎటువంటి ప్రమాదమూ జరగలేదని అధికారులు తెలిపారు. సాంకేతిక లోపాన్ని సరిచేసిన తరువాత తిరిగి విమానం బయలుదేరుతుందని తెలిపారు. కాగా, విమానం ఆలస్యంతో విశాఖ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఇబ్బంది పడుతుండగా, అదే విమానంలో విశాఖకు వెళ్లాల్సిన హైదరాబాద్ ప్రయాణికుల పరిస్థితి కూడా అంతే.