GN RAO: జీఎన్ రావు ఒక గ్రూప్-1 ఆఫీసర్.. ఆయన దేంట్లో ఎక్స్ పర్ట్?: చంద్రబాబునాయుడు

షార్ట్స్‌లో చూడండి
జీఎన్ రావు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఏంటి జీఎన్ రావు కమిటీ? ఎవరా జీఎన్ రావు? ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? గ్రూప్-1 ఆఫీసర్. ఆయన తెలియనిది ఎవరికి? ‘జీఎన్ రావు కమిటీని వేశాం.. ఎక్స్ పర్ట్’ అని చెబుతున్నారు! దేంట్లో ఎక్స్ పర్ట్ ఆయన? నేను తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాను. నా దగ్గర పనిచేశాడు. నాకు తెలియని వ్యక్తా జీఎన్ రావు? జీఎన్ రావు ఎక్కడి నుంచో ఊడిపడ్డాడని కొత్తవాళ్లు అనుకుంటారు. ఒక గ్రూప్-1 ఆఫీసర్ ను పెట్టుకుని నాటకాలు ఆడతారా?’ అని ప్రభుత్వంపై మండిపడ్డారు.

నిపుణుల కమిటీ నివేదికకు ముందే అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి సీఎం జగన్ ఎందుకు చెప్పారు? అదే మాదిరి నివేదికను ఎందుకు వాళ్లు ఇచ్చారు? అంటే, పరీక్షలో పేపర్ లీకైనట్టుగా అని విమర్శలు చేశారు. ‘మీరే చెప్పి నివేదిక రాయిస్తారా? 'సిగ్గుపడటంలేదు? బాధనిపించట్లేదు?’, ‘ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రాంతంపై ఎందుకు ఇంత కక్ష?’ అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.
Go Back to Shorts
GN RAO
Committee
Chandrababu
Telugudesam

More Telugu News