యాంకర్ అనసూయకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాంకర్ అనసూయకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు!

  • రూ. 55 లక్షలు కట్టాలంటూ నోటీసులు
  • సర్వీస్ ట్యాక్స్ కింద రూ. 80 లక్షల బకాయిలు
  • ఇప్పటి వరకు రూ. 25 లక్షలు మాత్రమే కట్టిన అనసూయ
ప్రముఖ తెలుగు యాంకర్, సినీ నటి అనసూయకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. రూ. 55 లక్షలు కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. సర్వీస్ ట్యాక్స్ కింద అనసూయ రూ. 80 లక్షలు బకాయి ఉన్నారు. అయితే, ఆమె కేవలం రూ. 25 లక్షలు మాత్రమే కట్టారు. దీంతో, మిగిలిన మొత్తాన్ని కూడా వెంటనే చెల్లించాలని సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేశారు. టాలీవుడ్ కు చెందిన పలువురిపై జీఎస్టీ దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ వీరు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని అధికారులు చెబుతున్నారు.
Anasuya
Tollywood
GST

More Telugu News