ఝార్ఖండ్ విచిత్రం: సీఎంగా ఉండి మళ్లీ గెలిచిన వారే లేరు!
- రాష్ట్రానికి సీఎంలైనా ఆరుగురు మళ్లీ గెలవలేదు
- తాజా ఎన్నికల్లో సీఎం రఘుబర్ ఓటమి
- ఓటమి పొందిన ఆరుగురు మంత్రులు, స్పీకర్
ఓటమి పాలయిన ఆరుగురు మంత్రులు
అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ కంగుతింది. పార్టీకి చెందిన మహామహులందరూ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి, ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. జంషెడ్ పూర్ తూర్పు నియోజకవర్గంలో పోటీచేసిన ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ స్వంతంత్ర అభ్యర్థి సరయిరాయ్ చేతిలో ఎనిమిదివేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మంత్రిగా పనిచేసిన రాయ్ కు అధికార బీజేపీ టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగి సత్తా నిరూపించుకున్నారు. ఓటమి పాలైన వారిలో సీఎం సహా ఆరుగురు మంత్రులు, స్పీకర్ ఉన్నారు. ఫలితాల అనంతరం రఘుబర్ దాస్ మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి పార్టీది కాదు. నాదే ఓటమి’ అని అన్నారు.