తెలంగాణలో విచిత్ర పరిస్థితి... 18 ఏళ్లు దాటినా ఓటు వేయలేకపోతున్న యూత్!
- 2019 జనవరి 1 అర్హత తేదీ
- ఎన్నికలు 2020 ఫిబ్రవరిలో జరిగే అవకాశం
- మరో నెలన్నరలో నోటిఫికేషన్!
వాస్తవానికి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7న అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటిస్తుంది. ఆపై మార్చిలో ఎన్నికలు నిర్వహించాలి. ఆ సమయంలో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి కాబట్టి, మే వరకూ ఆగకుండా, ఫిబ్రవరిలోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ, ఈ సంవత్సరం జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితాను రూపొందిస్తోంది. ఈ నెల 16న కేంద్ర ఎన్నికల సంఘం ఓ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.