ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఎదురులేని విరాట్ కోహ్లీ

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన ఆధిక్యతను చాటుకున్నాడు. తాజాగా మరోసారి టెస్టు బ్యాటింగ్ రాంకుల్లో నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. కోహ్లీ 928 రేటింగ్ పాయింట్లను కలిగివున్నాడు. ఈ జాబితాలో కోహ్లీ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో నిలిచాడు. స్మిత్ ఖాతాలో 911 పాయింట్లున్నాయి. మూడో స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ (864), నాలుగో స్థానంలో భారత ఆటగాడు ఛటేశ్వర్ పుజారా (791) ఉన్నారు. ఇక, పరుగుల వరద పారిస్తున్న ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుషేన్ ఐదో ర్యాంకుకు ఎగబాకాడు. ఈ జాబితాలో ఆరోస్థానంలో టీమిండియా బ్యాట్స్ మన్ అజింక్యా రహానే నిలిచాడు. మొత్తమ్మీద ఐసీసీ టెస్ట్ టాప్-10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఉండడం విశేషం.
Go Back to Shorts
ICC
Test Rankings
Virat Kohli
Steve Smith

More Telugu News