మా నాన్నకి ప్రమాదం జరగడంతో నా రూటు మారింది: 'సుడిగాలి' సుధీర్
Add ap7am to your home Screen

మా నాన్నకి ప్రమాదం జరగడంతో నా రూటు మారింది: 'సుడిగాలి' సుధీర్

  • నేను పుట్టి పెరిగింది విజయవాడలో 
  • స్కూల్ డేస్ లోనే మ్యాజిక్ షోలు చేసేవాడిని 
  •  పిల్లలకి డాన్స్ క్లాస్ లు చెప్పేవాడినన్న సుధీర్  
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో 'సుడిగాలి సుధీర్' ఒకరు. వారం .. వారం బుల్లితెరపై నవ్వుల సందడి చేస్తూనే, సినిమాల్లోనూ చిన్నచిన్న పాత్రలను వేస్తూ వస్తున్నాడు. ఇక త్వరలో ఆయన వెండితెరపై హీరోగానూ కనిపించనున్నాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

"మాది విజయవాడ .. నేను పుట్టిపెరిగింది అక్కడే. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ షోలు .. మ్యాజిక్ షోల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. స్కూల్ డేస్ లోనే నేను మ్యాజిక్ షోలు చేసేవాడిని. ఇక డాన్స్ కూడా నేర్చుకుంటూ వచ్చాను. అలాంటి పరిస్థితుల్లోనే మా నాన్నకి ప్రమాదం జరిగింది. కాలు విరిగిపోవడంతో ఆయన ఏమీ చేయలేని పరిస్థితి. ఆయన షుగర్ పేషంట్ కూడా కావడంతో నేను నా రూట్ మార్చుకోక తప్పలేదు. పిల్లలకి డాన్స్ క్లాస్ లు చెబుతూ, అలా వచ్చిన డబ్బుతో కుటుంబానికి అండగా నిలిచాను. ఇప్పుడు నేను మా నాన్నని ఏ పనీ చేయనీయడం లేదు" అని చెప్పుకొచ్చాడు.
Sudigali Sudheer
Ali

More Telugu News