దిశను చంపినప్పుడు ఎక్కడికెళ్లారు?... మానవ హక్కుల సంఘాలపై తిరగబడిన నెటిజన్లు!
Add ap7am to your home Screen

దిశను చంపినప్పుడు ఎక్కడికెళ్లారు?... మానవ హక్కుల సంఘాలపై తిరగబడిన నెటిజన్లు!

  • దిశ నిందితులను చంపేసిన పోలీసులు
  • పోలీసులపై కేసులు పెట్టాలంటున్న హక్కుల నేతలు 
  • ఏం న్యాయమని ప్రశ్నిస్తున్న నెటిజన్లు
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకంగా స్పందిస్తుండడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిశను అత్యంత దారుణంగా చంపినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడెక్కడికి వెళ్లారు మీరందరూ! అంటూ సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై కేసులు పెట్టాలంటూ హక్కుల సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తుండడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.

అన్యాయం జరిగినప్పుడు ఇలాంటి వాళ్లు బయటికి రారని, వచ్చినా సమస్యను పరిష్కరించరని విమర్శిస్తున్నారు. న్యాయం జరిగిన తర్వాత బయటికొచ్చి దాంట్లో లొసుగులు గుర్తించి ప్రచారం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారని, సమస్యను మరింత తీవ్రం చేయడానికి వస్తారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దేశం యావత్తూ దిశకు న్యాయం జరిగిందని సంతృప్తి వ్యక్తం చేస్తుంటే, వీళ్లు మాత్రం ఒకమ్మాయికి అన్యాయం జరిగినా కానీ, నలుగురు దుర్మార్గులను కాపాడాలని పోరాడడం ఏం న్యాయమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Disha
Telangana
Hyderabad
Police
Social Media

More Telugu News