ఆత్మహత్యాయత్నం చేసిన ప్రియురాలు... ఐసీయూలో తాళి కట్టిన ప్రియుడు
- మోసపూరిత మాటలతో లోబరచుకున్న యువకుడు
- ఆపై పెళ్లికి మొహం చాటేయడంతో ఆత్మహత్యాయత్నం
- బంధువులు కల్పించుకోవడంతో పెళ్లికి అంగీకారం
ఈ ఘటన పూణెలో జరిగింది. నగరానికి చెందిన సూరజ్ అనే యువకుడు, ఓ యువతి ప్రేమించుకున్నారు. ఆపై పెళ్లాడేందుకు సూరజ్ నిరాకరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. విషయాన్ని పసిగట్టిన బంధువులు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. సూరజ్ కు దేహశుద్ధి చేసి, ఆసుపత్రికి తరలించారు. ఆపై ఐసీయూలోనే ఆ జంట ఒకటైంది.