అలా అయితే, జగన్ పైనా కేసులు పెట్టాలా?: పవన్ కల్యాణ్
Add ap7am to your home Screen

అలా అయితే, జగన్ పైనా కేసులు పెట్టాలా?: పవన్ కల్యాణ్

  • సాకే పవన్ వ్యాఖ్యలను సమర్దించిన పవన్ కల్యాణ్
  • తలలు తీస్తానని అంటే కేసులు పెడతారా?
  • చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్ పైనా కేసు పెట్టాలా?
జనసేన పార్టీకి చెందిన సాకే పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచారు. సాకే పవన్ ఎంతో ఆవేదన చెందాడు కనుకనే తమ నాయకుడు అలా వ్యాఖ్యలు చేశారంటూ సమర్థించారు. తలలు తీస్తానని అంటే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. అలా అయితే, గతంలో చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత జగన్ పైనా కేసు పెట్టాలా? అని ప్రశ్నించిన పవన్, చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, ఈ దేశం ఎవరి జాగీరూ కాదని అన్నారు. దారి ఇస్తే రాయలసీమ మొత్తం పాదయాత్ర చేస్తానని, పులివెందుల నుంచి అన్ని ప్రాంతాల్లో నడుస్తానని అన్నారు.
Chandrababu
Pawan Kalyan
Jagan
sake pawan

More Telugu News