వైరల్ అవుతున్న శబరిమల గర్భగుడి చిత్రాలు... కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థానం బోర్డు!
- ఆలయంలో సెల్ ఫోన్లపై నిషేధం
- 18 మెట్లు దాటిన తరువాత అమలు
- భక్తులు సహకరించాలన్న అధికారులు
దీనిపై స్పందించిన ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు, ఆలయంలో ఫోన్లపై నిషేధాన్ని విధించింది. 18 బంగారు మెట్లు దాటిన తరువాత ప్రధాన ఆలయం ఎదురుగా, గర్భగుడి వద్ద మొబైళ్లను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. భక్తులు విధిగా తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేయాలని ఆదేశించారు. తొలిసారి ఉల్లంఘిస్తే, హెచ్చరికతో వదిలిపెడతామని, రెండోసారి ఉల్లంఘిస్తే, ఆ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విజువల్స్ తొలగిస్తామని అధికారులు వెల్లడించారు.