ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేక బీజేపీకి దూరమయ్యాను: పవన్ కల్యాణ్
Add ap7am to your home Screen

ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేక బీజేపీకి దూరమయ్యాను: పవన్ కల్యాణ్

  • పవన్ రాయలసీమ పర్యటన
  • కడప, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్
ఏపీ రాజకీయాల్లో ప్రబల శక్తిగా ఎదగాలనుకుంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాయలసీమ పర్యటనలో వాడీవేడి వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు. తిరుపతిలో ఇవాళ నిర్వహించిన కడప, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిధి సమీక్ష సమావేశంలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను ఆశయాల కోసం కట్టుబడి పనిచేస్తున్నానని పునరుద్ఘాటించారు. ఆశయాలను పక్కనబెట్టి తాను బీజేపీతో కలిసి ఉంటే ఇవాళ వైసీపీ ఈ విధంగా ఉండేదా? అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా అంశంలో బీజేపీ వైఖరిని వ్యతిరేకించానని, ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేక బీజేపీకి దూరమయ్యానని పవన్ వెల్లడించారు.

కాగా, పవన్ తన ప్రసంగంలో అమిత్ షాపై ప్రశంసలు కురిపించడంతో వైసీపీ నేతలు తమదైన రీతిలో భాష్యం చెబుతున్నారు. పవన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
pawan kalyan

More Telugu News