cm: ఏ సినిమాలో అయినా ‘పవన్ కుమార్’ అని పేరేసుకున్నాడా?: మంత్రి కొడాలి నాని

షార్ట్స్‌లో చూడండి
సీఎం వైఎస్ జగన్ ను ‘జగన్ రెడ్డి’ అని పవన్ కల్యాణ్ పిలిస్తే, పవన్ ని ‘పవన్ నాయుడు’ అని తాము పిలవడం ‘కామన్’ అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ‘నాయుడు’ అని తన పేరు పెట్టుకోలేదని పవన్ కల్యాణ్ చెబుతున్నారన్న వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందిస్తూ, ‘పవన్ కుమార్’ అని తన తండ్రి తనకు పేరు పెట్టారని పవన్ చెప్పారని, వాళ్ల తండ్రి పెట్టిన పేరును ఆయన ఉంచుకున్నాడా? పవన్ నటించిన సినిమాల్లో ఏ సినిమాలో అయినా ‘పవన్ కుమార్’ అని తన పేరు వేసుకున్నాడా? లేదుగా అని అన్నారు. పవన్ తన పేర్లు మార్చుకుంటూ వెళుతున్నాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Go Back to Shorts
cm
Jagan
Janasena
Pawan Kalyan

More Telugu News