మీ అవినీతిపై ఐఐఎం అహ్మదాబాద్ తో అధ్యయనానికి సిద్ధమేనా?: జగన్ కు వర్ల రామయ్య ప్రశ్న
- అవినీతిపై అధ్యయనం కోసం ఐఐఎంతో ఒప్పందం చేసుకోవడం సంతోషం
- ఈరోజు కాల్ సెంటర్ ను ప్రారంభించడం ఇంకా సంతోషం
- రాజకీయ అవినీతిపై కూడా అధ్యయనం చేయాలి
ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, 'రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా అధ్యయనం చేయాలని ఐఐఎం అహ్మదాబాద్ తో ఒప్పందం చేసుకోవడం సంతోషం. అందుకు ఈరోజు కాల్ సెంటర్ ను ప్రారంభించడం ఇంకా సంతోషం. కానీ, ప్రభుత్వ శాఖల్లోని అవినీతితో పాటు రాజకీయ అవినీతిపై కూడా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా, మన ముఖ్యమంత్రి అవినీతి కేసుల పైన కూడా. అందుకు సిద్ధమేనా ముఖ్యమంత్రిగారూ? అని ట్వీట్ చేశారు.