సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో హిందీ సినిమాలో రకుల్
  • ద్విపాత్రాభినయం చేస్తున్న రాజశేఖర్ 
  • రవితేజ 'క్రాక్' మొదలైంది
   *  తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ పై దృష్టి పెట్టిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా మరో చిత్రానికి సంతకం చేసింది. జాన్ అబ్రహాం హీరోగా నటించే 'ఎటాక్' చిత్రంలో ఓ నాయికగా ఆమె నటిస్తోంది.
*  ఇటీవల వచ్చిన 'కల్కి' చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో నటించిన డా.రాజశేఖర్ త్వరలో ఓ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనున్నారు. సీనియర్ నిర్మాత రమేశ్ ప్రసాద్ నిర్మించే చిత్రంలో లాయర్ గా, ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన పాత్రలను ఆయన పోషించనున్నారు.
*  రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'క్రాక్' రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. రవితేజ, శ్రుతి హాసన్ జంటపై ముఖ్య సన్నివేశాలను దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.
Rakul
John Abraham
Raviteja
Shruti Hassan

More Telugu News