Lover: ప్రియుడి అవసరాలు తీర్చేందుకు అక్క ఇంటికే కన్నం!

షార్ట్స్‌లో చూడండి
తన ప్రియుడి ఆర్థిక అవసరాలను తీర్చాలని భావించిన ఓ చెల్లెలు, సొంత అక్క ఇంటికే కన్నమేసి, అడ్డంగా దొరికిపోయింది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రామాంతపూర్ లో ఉండే ఝాన్సీ (20) బంజారాహిల్స్ లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రాహుల్ (21) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రాహుల్ కు డబ్బు అవసరపడగా, ఝాన్సీకి విషయం చెప్పాడు.

దీంతో ఆమె, ఫీర్జాదిగూడ బుద్ధానగర్‌ లో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లి, ఆమె ఇంట్లో లేని సమయంలో బంగారు నగలు దొంగిలించింది. వాటిని రాహుల్ కు ఇవ్వగా, నిఖిల్ అనే తన స్నేహితుడితో కలిసి వాటిని అమ్మేశాడు.  ఇంట్లోని బంగారం పోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఝాన్సీని అనుమానించి, గట్టిగా ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించింది. రాహుల్‌, నిఖిల్‌, ఝాన్సీలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని, నాలుగు తులాల బంగారు నగలు రికవరీ చేశామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Lover
Sister
Theft
Gold

More Telugu News