Mammootty: నాలుగు భాషల్లో ఒకే రోజున రానున్న 'మమాంగమ్'

షార్ట్స్‌లో చూడండి
మలయాళంలో సీనియర్ స్టార్ హీరోగా మమ్ముట్టికి గల క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన తాజా చిత్రంగా 'మమాంగమ్' రూపొందింది. భారీ చారిత్రక నేపథ్యంలో సాగే కథ ఇది. ఒకనాటి సామాజిక పరిస్థితులు .. అప్పటి వేషధారణతో ఈ సినిమా సాగనుంది.

మలయాళంలో మమ్ముట్టి కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమైందని అంటున్నారు. మలయాళంతో పాటు తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నాలుగు భాషల్లోను డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. అత్యధిక థియేటర్స్ లో విడుదల కానున్న ఈ సినిమా, మమ్ముట్టి కెరియర్లోనే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Mammootty

More Telugu News