Grame Smith: ఓ ఇంటివాడైన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్

షార్ట్స్‌లో చూడండి
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఓ ఇంటివాడయ్యాడు. నాలుగేళ్ల క్రితం 2015లో తన మొదటి భార్య మోర్గాన్ డేన్ నుంచి విడాకులు తీసుకున్న అతను, తాజాగా తన ప్రియురాలు రోమీ లాంఫ్రాంచీని వివాహమాడాడు. ఈ విషయాన్ని గ్రేమ్ స్మిత్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించాడు. గత సంవత్సరం రోమితో స్మిత్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహం మూడు రోజుల క్రితం జరిగింది. నవంబరు 2వ తేదీ తన జీవితంలో మర్చిపోలేని రోజని స్మిత్ వ్యాఖ్యానించాడు.

కాగా, వ్యక్తిగత కారణాలతో మోర్గాన్ నుంచి తాను విడిపోయినట్టు గతంలో స్మిత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు... పాప కాడెన్స్ (7), బాబు కార్టర్ (6) ఉన్నారు. స్మిత్ ప్రియురాలు రోమీ సైతం 2016 డిసెంబర్ లో ఓ బాబుకు జన్మనిచ్చింది. వీరిద్దరి వివాహానికీ వారి పిల్లలంతా హాజరయ్యారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన స్మిత్, ప్రస్తుతం కామెంటేటర్‌ గా సేవలు అందిస్తున్నాడు.
Go Back to Shorts
Grame Smith
Romi
Marriage
Lover
Southafrika

More Telugu News