బన్నీ విషయంలో అలా జరగడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది: రాఘవేంద్రరావు
- వెంకటేశ్ కి ముందుగానే కల వచ్చిందట
- కొంతకాలానికి అది నిజం కావడం విశేషం
- కృష్ణగారి కోరిక మేరకే మహేశ్ సినిమా చేశానన్న రాఘవేంద్రరావు
బన్నీని హీరోగా పరిచయం చేసే విషయంలో మాత్రం ఒక చిత్రమైన సంఘటన జరిగింది. బన్నీతో నేను చేసిన 'గంగోత్రి' నా 100వ సినిమా. ఆ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకి బన్నీ అమ్మగారు నాకు ఒక విషయం గుర్తు చేశారు. ఒకసారి చిరంజీవిగారి బర్త్ డే సందర్భంగా ఆయన ఇంటికి నేను వెళితే, అక్కడ చిరంజీవి పాటలకు వాళ్ల పిల్లలంతా డాన్సులు చేస్తున్నారు. వాళ్లలో బన్నీ కూడా వున్నాడు. బన్నీ డాన్స్ బాగుందంటూ, ఎప్పటికైనా హీరోగా బన్నీ ఫస్టు సినిమా నేనే తీస్తాను .. ఇదిగో అడ్వాన్స్ అంటూ సరదాగా ఓ 100 రూపాయలు ఇచ్చానట. ఆ విషయాన్ని బన్నీ అమ్మగారు గుర్తుచేయడంతో నాకు చాలా ఆశ్చర్యం కలిగింది" అని చెప్పుకొచ్చారు.