constable: కానిస్టేబుల్ సిద్ధాంతి ప్రతాప్ రాజీనామా ఆమోదం.. వెళ్లి పెళ్లి చేసుకోమని దీవించిన కమిషనర్!

షార్ట్స్‌లో చూడండి
చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్ధాంతి ప్రతాప్ గుర్తున్నాడా? బీటెక్ చదివి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అతడు రెండు నెలల క్రితం పై అధికారులకు రాసిన రాజీనామా లేఖ సంచలనమైంది. పెళ్లి కోసం ప్రతాప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానిస్టేబుల్‌కు పిల్లనివ్వబోమంటూ అమ్మాయి తరపు పెద్దలు చెప్పడంతో మనస్తాపం చెందిన ప్రతాప్ తనకు ఎదురైన అనుభవాలతో పై అధికారులకు లేఖ రాశాడు.

ఇంజినీరింగ్ చదివినా పోలీస్ శాఖపై మక్కువతో ఉద్యోగంలో చేరిన తనకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ప్రతాప్ ఆ లేఖలో వాపోయాడు. కానిస్టేబుల్ అంటే రోజంతా పని ఉంటుందని, కాబట్టి తాను పెళ్లి చేసుకోలేనని ఓ అమ్మాయి తనతో నేరుగా చెప్పిందని పేర్కొన్నాడు. అంతేకాదు, పోలీస్ శాఖలో ప్రమోషన్లు అంతంత మాత్రమేనని, 20 ఏళ్ల క్రితం కానిస్టేబుల్‌గా చేరిన వారు కూడా చివరికి హెడ్‌ కానిస్టేబుల్‌గానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు రాజీనామా లేఖ రాశాడు. తాజాగా, ప్రతాప్ లేఖను పరిశీలించిన సీపీ.. అతని రాజీనామాను ఆమోదించారు.
Go Back to Shorts
constable
charminar
marriage
resignation letter

More Telugu News