Raviteja: 'నేను లోకల్' దర్శకుడితో రవితేజ

షార్ట్స్‌లో చూడండి
రవితేజ తాజా చిత్రంగా 'డిస్కోరాజా' నిర్మితమవుతోంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో ఆయన జోడీగా శ్రుతి హాసన్ కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే రవితేజ మరో ప్రాజెక్టును సెట్ చేసినట్టుగా సమాచారం. గోపీచంద్ మలినేని సినిమా తరువాత ఆయన త్రినాథరావు నక్కినతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. 'సినిమా చూపిస్తమావ' .. 'నేను లోకల్' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తెరకెక్కించిన త్రినాథరావు, కామెడీ ప్రధానంగా సాగే కథతో ఈ సినిమాను రూపొందించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తారట.
Go Back to Shorts
Raviteja

More Telugu News